
అందరిబ్రదుకులు నాతనివే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అందరిబ్రదుకులు నాతనివే కందువెల్ల శ్రీకాంతునిదే ॥చ1॥ వేమరుఁ జదివెడి విప్రుల వేదము సోముకవైరి యశోవిభవం శ్రీమించున మరల జీవనమెల్ల సు- ధామథనునిసంతత కరుణే ॥చ2॥ హితవగు నిలలో నీసుఖమెల్లను దితి సుతదమనుఁడు దెచ్చినదే తతి తల్లి దండ్రి తానై కాచిన రతి ప్రహ్లదవరదుని కృపే ॥చ3॥ ఆలరినయమరేంద్రాదుల బ్రదుకులు బలిబంధనుకృపఁ బరగినవే బలసి మునుల యాపదలు వాపుటకు బలునృపభంజను పరిణతలే ॥చ4॥ పూని యనాథుల పొందుగఁ గాచిన- జానకీవిభుని సరసతలే నానాభూభరణంబులు నందుని- సూనుఁడు చేసినసుకృతములే ॥చ5॥ తలకొని ధర్మము తానై నిలుపుట కలుషవిదూరునిగర్వములే నిలిచి లోకములు నిలిపినఘనుఁడగు.- కలియుగమున వేంకటపతివే |
రాగము: పాడి రేకు: 0065-02 సంపుటము: 1-335 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి