
ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా కాముకపు మనసునకు కడ మొదలు లేదు ॥చ1॥ వత్తిలోపలి నూనె వంటిది జీవనము విత్తుమీదటి పొల్లు విధము దేహంబు బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక ॥చ2॥ ఆకాశ పాకాశ మరుదైన కూటంబు లోకరంజకము తమలోనిసమ్మతము చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు చేకొనిననేమి యివి చెదిరిననునేమి ॥చ3॥ గాదెఁబోసినకొలుచుకర్మి సంసారంబు వేదు విడువనికూడు వెడమాయబదుకు వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా- మోదంబు వడసినను మోక్షంబు గనుట |
రాగము: వరాళి రేకు: 0064-01 సంపుటము: 1-328 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి