
జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన దైవికము గడవ నెంతటివాఁడు దాను ॥చ1॥ విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁ గడచి మున్నాడె నెక్కడివివేకములు వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధముల మెడవట్టి నూకె నేమిటికింక నెరుక ॥చ2॥ పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు మాయనియ్యనికోపమహిమ కరుణామతిని వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము ॥చ3॥ సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని- నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలు తిరువేంకటాచలాధిపునిమన్ననఁగాని వెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు |
రాగము: దేశి రేకు: 0063-06 సంపుటము: 1-327 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేశి