
త్వమేవ శరణం త్వమేవ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥చ1॥ వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీసతీశ సరసిజనేత్రా భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥చ2॥ బలభద్రానుజ పరమపురుష దుగ్ద- జలధినిహార కుంజరవరద సులభ సుభద్రాసుముఖ సురేస్వర కలిదోషహరణ జగన్నాథా ॥చ3॥ వటపత్రశయన భువనపాలన జంతు ఘటకారకరణ శృంగారాధిపా పటుతర నిత్యవైభవరాయ తిరువేం- కటగిరినిలయ జగన్నాథా |
రాగము: శ్రీరాగం రేకు: 0063-02 సంపుటము: 1-323 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం