
సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సేవింతురా యితనిఁ జెలఁగి పరు లిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితఁడు ॥చ1॥ పాలచవి యితఁడెఱుఁగు పాలఁబవళించ గో- పాలుఁడని నేమితని భజియించఁగా పాలుపడి తల్లి చనుఁబాలు సహితంబు నే- కాలమునుఁ బాపె నెక్కడి దైవమితఁడు ॥చ2॥ పుట్టిపఁ దానె మఱి పురుషోత్తముఁడు మంచి- పుట్టు వొగీననుచుఁ బూజించఁగా పట్టుకొని మముఁ దెచ్చి బలిమిఁ బుట్టువులెల్లఁ గట్టిపెట్టించె నెక్కడి దైవమితఁడు ॥చ3॥ కర్మకర్తారుఁడని కడలేనిపుణ్యముల … కర్మఫలములు దనకుఁ గైకొలుపఁగా కర్మగతిఁ దెచ్చి వేంకటవిభుఁడు మావు భయ….. కర్మములఁ జెరిచె నెక్కడి దైవమితఁడు |
రాగము: ముఖారి రేకు: 0048-01 సంపుటము: 1-293 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి