ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి – అన్నమయ్య సంకీర్తన

ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి
ఆకడ నాఁతడె హరి నెఱిగిన వాఁడు
॥చ1॥
పరగినసత్యసంపన్నుఁడైనవాఁడే
పరనిందసేయఁ దత్పరుఁడుగాని వాఁడు
అరుదైన భూతదయానిధియగువాఁడే
పరులుదానేయని భావించు వాఁడు
॥చ2॥
నిర్మలుఁడై యాత్మనియతి గలుగువాఁడే
ధర్మతత్పరబుధ్ధిఁ దగిలిన వాఁడు
కర్మమార్గములు గడవనివాఁడే
మర్మమై హరిభక్తి మఱవని వాఁడు
॥చ3॥
జగతిపై హితముగాఁ జరియించు వాఁడే
పగలేక మతిలోన బ్రతికిన వాఁడు
తెగి సకలము నాత్మ దెలిసివాఁడే
తగిలి వేంకటేశుదాసుఁడయిన వాఁడు
రాగము: భూపాళం
రేకు: 0047-07
సంపుటము: 1-292

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భూపాళం

చదవండి :  చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: