
ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము తామసుండఁజుమ్మీ ముందరునున్నదైవమా ॥చ1॥ పాతకపుఁజేతులనే పట్టి నిన్నుఁ బూజించు- ఘాఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యము చేతనముఁ బోదిసేయుచిత్తము నీదేకాన రాతిబొమ్మఁజుమ్మీ భారము నీది దైవమా ॥చ2॥ వూనినయెంగిలినోర నొప్పగునిన్నుఁ బొగడు- హీనజంతువునకు నా కేఁటిపుణ్యము తేనెవూసి నీ విట్లాఁ దిప్పఁగానే తిరిగేటి- మానిబొమ్మఁజుమ్మీ నామతిలోనిదైవమా ॥చ3॥ జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటి కూళఁడ నాకేఁటితేఁకువపుణ్యము పాలువోసిపైంచిననాపాలి వేంకటేశనే తోలిబొమ్మఁజుమ్మీ కాతువుగాని దైవమా |
రాగము: ముఖారి రేకు: 0047-01 సంపుటము: 1-286 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి