ఇన్ని నేఁతలకు నిది యొకటే – అన్నమయ్య సంకీర్తన

ఇన్ని నేఁతలకు నిది యొకటే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఇన్ని నేఁతలకు నిది యొకటే
కన్నా మన సిది కానదు గాని
॥చ1॥
పాతకకోట్లు భవములు భస్మీ-
భూతముసేయఁగఁ బొడవొకటే
శ్రీతరుణీపతిచింత, నిజముగా
యేతరి చిత్తం బెఱఁగదుగాని
॥చ2॥
మరణభయంబులు మదములు మలినీ-
కరణము సేయఁగఁగల దొకటే
హరినామామృత , మందుమీఁది రతి
నిరతము నా కిది నిలువదుగాని
॥చ3॥
కుతిలములును దుర్గుణములునుఁ దృణీ –
కృతములు సేయఁగ గురుతొకటే
పరియగువేంకటపతి సేవారతి,
గతియని మతి గని కానదుగాని
రాగము: దేవగాంధారి
రేకు: 0046-06
సంపుటము: 1-285

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి

చదవండి :  ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: