భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా- – అన్నమయ్య సంకీర్తన

భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా-
కేలీ విహార లక్ష్మీనరసింహా
read
॥చ1॥
ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార
లలితనిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీకుముదహితరవిగగన-
చలనవిధినిపుణ నిశ్చల నారసింహా
॥చ2॥
వివరఘనవదనదుర్విహసననిష్ఠ్యూత –
లవదివ్య వరుషలాలాఘటనయా
వివిధజంతువ్రాతభువన మగ్నీకరణ
నవనవప్రియ గుణార్ణవ నారసింహా
॥చ3॥
దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి
కారస్ఫులింగసంగక్రీడయా
వైరిదానవఘోరవంశభస్మీకరణ –
కారణ ప్రకటవేంకట నారసింహ
రాగము: శ్రీరాగం
రేకు: 0046-02
సంపుటము: 1-281

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  వైష్ణవులుగానివార లెవ్వరు లేరు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *