
మాయపుదనుజులమదవైరి కపి- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మాయపుదనుజులమదవైరి కపి- రాయఁడు వీఁడివో రామునిబంటు ॥చ1॥ పెట్టిన జంగయు పెంపుమిగుల మొలఁ గట్టినకానెయు గర్వమున నిట్టనిలిచి పూనినచేత నడిమి- దిట్ట వీఁడువో దేవునిబంటు ॥చ2॥ నవ్వుచు లంకానగరపుదనుజుల- కొవ్వణఁచినకపికుంజరుఁడు మువ్వురువేల్పుల మొదలి భూతియగు- రవ్వగు సీతారమణునిబంటు ॥చ3॥ పంకజసంభవుపట్టముగట్టను వుంకించిన తనవొడయనిచే పొంకపుకలశాపురహనుమంతుఁడు వేంకటరమణుని వేడుకబంటు |
రాగము: సామంతం రేకు: 0045-06 సంపుటము: 1-279 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం