
వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి ॥చ1॥ పంచభూతములనెడి పలువన్నె నూలు చంచలపుగంజి వోసి చరిసేసి కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచిమంచి చీరలమ్మే మారు బేహారి ॥చ2॥ మటుమాయములఁ దన మగువ పసిఁడి నీరు చిటిపొటి యలుకలఁ జిలికించఁగా కుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టి పటవాళి చీరలమ్మే బలుబేహారి ॥చ3॥ మచ్చిక కర్మమనేటి మైల సంతలోన వెచ్చపు కర్మధనము వెలువచేసి పచ్చడాలుగాఁ గుట్టి బలువేంకటపతి ఇచ్చకొలఁదుల నమ్మే ఇంటిబేహారి |
రాగము: వరాళి రేకు: 0045-03 సంపుటము: 1-275 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి