నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి – అన్నమయ్య సంకీర్తన

నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి
కామింప నిట్టిదని కానరా దటుగాన
॥చ1॥
నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి-
నుండుదువుగాని నీ వొకటియునుఁ గావు
దండిగలగిరి ప్రతిద్వని దోచుఁగాని యది
కొండలోపల లేదు కొండయునుఁ గాదు
॥చ2॥
బలసి యిన్నిటిలోపలనుఁ జైతన్యమై
మెలఁగుదువుగాని యేమిట నీవు లేవు
పలుదెరఁగులైన దర్పణమునందొక నీడ
వొలయుఁగా కందు దలపోయు నది లేదు
॥చ3॥
వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ-
వుడివోయి యందుండ కుండుటయు లేదు
చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ-
పొడవు పరిపర్ణమై పొలుపొందుఁగాన
రాగము: కన్నడగౌళ
రేకు: 0044-03
సంపుటము: 1-270

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ

చదవండి :  ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *