ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క – అన్నమయ్య సంకీర్తన

ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క
యే పొద్దును భజియించఁగ నితరుఁడు మరి కలఁడా
॥చ1॥
నిరుపాధిక నిజబంధుఁడు నిరతి శయానందుఁడు
కరి వరదుఁ డితఁడే గాక ఘనుఁడధికుఁడు గలఁడా
॥చ2॥
సంతత గుణ సంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడు
అంతర్యామితఁడే కాక అధికుఁడు మరి కలఁడా
॥చ3॥
పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడు
తిరువేంకట విభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా
రాగము: శ్రీరాగం
రేకు: 0043-06
సంపుటము: 1-266

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *