
మోహము విడుచుటే మోక్షమది – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మోహము విడుచుటే మోక్షమది దేహ మెఱుఁగుటే తెలివీనదే ॥చ1॥ ననిచిన తనజన్మముఁ గర్మముఁ దన- పనియు నెఱుగుటే పరమ మది తనకు విధినిషేధములుఁ బుణ్యముల- ఘనత యెఱుగుటే కలిమి యది ॥చ2॥ తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులను యెఱఁ గనిదే కులహీన తది చఱులఁ బొరలి యాచారధర్మములు మఱచినదే తనమలిన మది ॥చ3॥ కమ్మరఁ గమ్మరఁ గామభోగములు నమ్మి తిరుగుటే నరక మది నెమ్మది వేంకటనిలయునిదాసుల- సొమ్ముయి నిలుచుట సుకృత మది |
రాగము: ఆహిరి రేకు: 0043-03 సంపుటము: 1-263 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి