బాలులతో వీథులలోఁ బారాడువాఁడు – అన్నమయ్య సంకీర్తన

బాలులతో వీథులలోఁ బారాడువాఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
బాలులతో వీథులలోఁ బారాడువాఁడు
కోలలెత్లుక వుట్లు గొట్టీఁ జుండీ
॥చ1॥
నారికడపువక్కలు నానిన సనగలు
చారపప్పుఁ దేనెలు చక్కెరలును
పేరిననేతులు నానబియ్యాలు నుట్ల నవే
చేరి యశోదబిడ్డకు జెప్పేరు సుండీ
॥చ2॥
చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును
చెక్కిన మెత్తనితూఁట చెఱకులును
పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవే
చక్కనెశోదబిడ్డకుఁ జాటేరు సుండీ
॥చ3॥
నవ్వులుఁ జిటిబెల్లాలు నున్ననిచిమ్మిలులు
నవ్వుటిడియునుఁ జిన్ని నురుగులును
యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి
కివ్వకివ్వ నవ్వ నణఁకించీ జుండీ
రాగము: పాడి
రేకు: 0042-02
సంపుటము: 1-256

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి

చదవండి :  తోరణములే దోవెల్లా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *