
కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల కడలేని జన్మసాగర మీఁదనేల ॥చ1॥ దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_ లరిదిమమతలకుఁ దొడ వడియాసలు గురుతయిన యాసలకుఁ గోరికలు జీవనము పరగ నిన్నిటికి లంపటమె కారణము ॥చ2॥ తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ_ ముదుటయిన తాపమున కుండఁగఁ జోటు పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ- మదము పెంపునకుఁ దనమనసు కారణము ॥చ3॥ వెలయఁ దనమనసునకు వేంకటేశుఁడు గర్త బలిసి యాతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్త తలకొన్న తలఁపు లివి దైవమానుషముగాఁ దలఁచి యాత్మేశ్వరునిఁ దలఁపంగ వలదా |
రాగము: ముఖారి రేకు: 0041-03 సంపుటము: 1-251 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి