సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త- – అన్నమయ్య సంకీర్తన

సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త-
మొకటికినిఁ జొరదు విధియోగమౌఁగాదో
॥చ1॥
దొరతనంబట కలిమి దోడుగాదట మంచి-
తరుణులట మోహమట దైన్యంబట
విరహమట దారిద్య్రవివశుఁడౌనట చూడ
నరయ నిది కర్మఫలమౌనో కాదో
॥చ2॥
రాజసన్మానమట రవణహీనత్వమట
తేజమట నలువంకఁ దిరిపెంబట
వాజివాహనములట వాఁడి లేదట తొంటి-
పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో
॥చ3॥
యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగుల
బలిమిగలదట సదా పరిభవమట
చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని
గొలువనేరనివెనకఁ గొరఁతలౌఁగాదో
రాగము: శ్రీరాగం
రేకు: 0040-05
సంపుటము: 1-247

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  పుడమినిందరి బుట్టె భూతము కడుఁ-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *