
నమో నారాయణాయ నమః – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ ॥చ1॥ ధరణీసతీఘనస్తనశైలపరిరంభ- పరిమళశ్రమజలప్రమదాయ సరసిజనివాసినీసరసప్రణామయుత- చరణాయ తే నమో సకలాత్మకాయ ॥చ2॥ సత్యభామాముఖాంచనపత్రవల్లికా- నిత్యరచనక్రియానిపుణాయ కాత్యాయనీస్తోత్రకామాయ తే నమో ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ ॥చ3॥ దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం- భావితామలపాదపంకజాయ కైవల్యకామినీకాంతాయ తే నమో శ్రీవేంకటాచల శ్రీనివాసాయ |
రాగము: శ్రీరాగం రేకు: 0040-03 సంపుటము: 1-245 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం