సొగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు – అన్నమయ్య సంకీర్తన

సొగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సొగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు
పగవానివలెనె లోపల దాఁగుఁగాక
॥చ1॥
దక్కునా పేదకును తరముగానిధనంబు
చిక్కి యెవ్వరికై నఁ జేరుఁగాక
వెక్కసంబైన గోవిందునిఁ దలఁపు బుద్ధి
తక్కిన పరులకెల్లఁ దలఁపేల కలుగు
॥చ2॥
అరగునా దుర్భలున కరుదైన యన్నంబు
కరుచబుద్ధులను నరమిగొనుఁగాక
తొరలునా హరివినుతి దుష్టునకు నది నోరఁ
దొరలెనా యతనినే దూషించుఁగాక
॥చ3॥
చెల్లునా యమృతంబు సేవించ నధమునకు
వొల్లనని నేలపై నొలుకుఁగాక
వెల్లి గొనుమందునకు వేంకటేశుస్మరణ
చల్లనౌనా మనసు శఠియించుఁగాక
రాగము: బౌళి-జంపెతాళం
రేకు: 0039-06
సంపుటము: 1-242

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి-జంపెతాళం

చదవండి :  అతిదుష్టుఁడ నే నలసుఁడను

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *