
కొనరో కొనరో మీరు కూరిమిమందు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కొనరో కొనరో మీరు కూరిమిమందు వునికిమనికి కెల్ల నొక్కటే మందు ॥చ1॥ ధ్రువుఁడు గొనినమందు తొల్లియుఁ బ్రహ్లాదుఁడు చవిగాఁ గొనినమందు చల్లనిమందు భవరోగములు వీడిపారఁగఁ బెద్దలు మున్ను జవకట్టికొనిన నిచ్చలమైనమందు ॥చ2॥ నిలచి నారదుఁడు గొనినమందు జనకుఁడు గెలుపుతోఁ గొని బ్రదికిన యామందు మొలచి నాలుగుయుగములరాజులు ఘనులు కలకాలముగొని కడగన్నమందు ॥చ3॥ అజునకుఁ బరమాయువై యొసగినమందు నిజమై లోకములెల్ల నిండినమందు త్రిజగములు నెఱఁగ తిరువేంకటాద్రిపై ద్వజమెత్తెఁ గోనేటిదరినున్నమందు |
రాగము: శంకరాభరణం రేకు: 0039-01 సంపుటము: 1-237 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం