
వేసరితిఁమెట్ల నీవెంటఁ దిరిగి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వేసరితిఁమెట్ల నీవెంటఁ దిరిగి గాసిఁబెట్టక మమ్ముఁ గావరాదా ॥చ1॥ తీసితివి కోరికల తెగనీక పంచలకు తోసితివి యింటింటఁ దోయఁదోయ చేసితివి నీచేఁత చెల్లె నిఁకనైనను ఆస నీపొందొల్ల మంపరాదా ॥చ2॥ కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁ బెట్టితివి దు: ఖములఁ బెనచిపెనచి పట్టితివి చలము మము పాయనని యాస నీ- విట్టైన గొంతసుఖ మియ్యరాదా ॥చ3॥ కఱపితివి పాపములే కడఁగి నానావిధుల నెఱపితివి దుర్దశలే నేర్పుమెరసి తెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని- నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో |
రాగము: దేసాక్షి రేకు: 0038-01 సంపుటము: 1-231 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షి