సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి – అన్నమయ్య సంకీర్తన

సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి
యిరవు దెలిసియుఁ దెలియనియ్యఁడటుగాన
॥చ1॥
తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు
వెలుఁగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణం బటువలెనె కాఁబోలు లోకంబు
గలదెల్ల వెలిలోనఁ గనిపించుఁ గాన
॥చ2॥
మేరమీరిననీలమేఘమో యితఁడేమి
భూరిసంపదలతోఁ బొలయుచున్నాడు
కారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకు
కోరికలు దలఁపులోఁ గురియు నటుగాన
॥చ3॥
తనివోనిఆకాశతత్వమో యితఁడేమి
అనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడు
ఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబు
తనయందె యణఁగి యుద్భవమందుఁగాన
రాగము: ముఖారి
రేకు: 0037-02
సంపుటము: 1-228

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ఒప్పులై నొప్పులై వుండుఁగాన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *