ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు – అన్నమయ్య సంకీర్తన

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా
॥చ1॥
తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాక
నెలకొని మింట నవి నిలిచీనా
పొలఁతుల వలపులు పొలసిపోవుఁగాక
కలకాలం బవి కడతేరీనా
॥చ2॥
యెండమావులు చూడ నేరులై పారుఁగాక
అండకుఁబోవ దాహ మణఁగీనా
నిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడ
వుండినట్టేవుండుఁగాక వూఁతయ్యీనా
॥చ3॥
కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక
మెలఁకువఁ జూడ నవి మెరసీనా
అలివేణులమేలు ఆసపాటేకాక
తలఁపు వేంకటపతిఁ దగిలీనా
రాగము: పాడి
రేకు: 0036-01
సంపుటము: 1-220

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి

చదవండి :  తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *