
ఏమి గలిగెను మా కిందువలన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమి గలిగెను మా కిందువలన వేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు ॥చ1॥ తటతటన నీటిమీఁదట నాలజాలంబు- లిటునటుఁ జరించవా యీఁది యీఁది అటువలెనెపో తమకమంది సంసారంపు- ఘటనకై తిరిగితిమి కడ గానలేక ॥చ2॥ దట్టముగఁ బారావతముల మిన్నుల మోవ కొట్టఁగొన కెక్కవా కూడి కూడి వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు బట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట ॥చ3॥ బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్ల పొరలదా పలుమారుఁ బోయిపోయి వరుస జన్మముల నటువలెనె పొరలితిమి తిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక |
రాగము: ఆహిరి రేకు: 0035-05 సంపుటము: 1-218 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి