తన కర్మమెంత చేఁతయు నంతే – అన్నమయ్య సంకీర్తన

తన కర్మమెంత చేఁతయు నంతే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
తన కర్మమెంత చేఁతయు నంతే
గొనకొన్న పనియంత కూలీనంతే
॥చ1॥
తలఁపులో హరి నెంత దలఁచె నేఁడే వాని
కలిమియు సుఖమును గల దంతే
తులఁదూఁచఁ బైఁడెంత తూఁకము నంతే
నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే
॥చ2॥
సిరివరుపూజెంత సేసె నేఁడే వాని-
దరియును దాపు నెంతయు నంతే
పురిగొన్న యీవెంత పొగడూ నంతే
నరపతిచనవెంత నగవూ నంతే
॥చ3॥
శ్రీవేంకటపతి చింత యంత నేఁడే
భావపరవశము పలుకూ నంతే
దైవము కృప యంత తానూ నంతే
యేవంక జయమెంత యిరవూ నంతే
రాగము: సాళంగం
రేకు: 0034-06
సంపుటము: 1-213

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగం

చదవండి :  గాలినే పోయఁ గలకాలము

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *