మే ఒకటో తేదీ నుంచి 31 వరకు జిల్లా కోర్టుకు వేసవి సెలవులు

కడప : జిల్లా కోర్టుకు మే ఒకటో తేదీ-బుధవారం  నుంచి వేసవి సెలవులు మంజూరు చేస్తు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా కోర్టుతోపాటు అయిదు అదనపు జిల్లా కోర్టులు, అన్ని సినియర్‌, సివిల్‌ జిల్లా కోర్టులకు మే ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు వర్తిస్తాయి.

వేసవి సెలవుల్లో సివిల్‌ కేసుల విచారణ ఉండదు. జిల్లా వ్యాప్తంగా అత్యవసర సివిల్‌ కేసులు విచారించేందుకు జిల్లా స్థాయి న్యాయమూర్తి ఒకేషనల్‌ కోర్టు జడ్జిగా పని చేస్తారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి సూర్యనారాయణ గౌడ్‌ను ఒకేషనల్‌ కోర్టు సివిల్‌ జడ్జిగా 1 నుంచి 17 వరకు వ్యవహరిస్తారు. మిగిలిన సెలవులకు మరో జిల్లా న్యాయమూర్తిని నియమిస్తారు.

చదవండి :  జగన్ గెలుపు ఆపలేం... :నిఘా వర్గాలు ?

ఈ ఒకేషనల్‌ కోర్టు కడపలో మే 2,7,9,14,16 తేదిల్లో, ప్రొద్దుటూరులో 3,10 తేదిల్లో, రాయచోటిలో 6,13 తేదిల్లో, రాజంపేటలో 1,8,15 తేదిల్లో పని చేస్తాయి.

జిల్లాలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు మే 8 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: