
తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు
॥పల్లవి॥ తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచలబుద్ధి మానీనా ॥చ1॥ జడ్డుమానవుఁడు చదువఁజదువ నాస వడ్డివారుఁగాక వదలీనా గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన దుడ్డుపెట్లే కాక దొరకీనా ॥చ2॥ దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము తెలిసీనా శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక పావనమతియై పరగీనా |
రాగము: నాట రేకు: 0032-04 సంపుటము: 1-198 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాట