
లంకెలూడుటే లాభము యీ-
॥పల్లవి॥ లంకెలూడుటే లాభము యీ- కింకరులను నలఁగెడికంటెను ॥చ1॥ జంపులఁ జంపక సరుగనఁబాసేటి- లంపటమేపో లాభము కంపుమోపుతోఁ గనలి శరీరపు- కొంపలోన వేఁగుట కంటెను ॥చ2॥ యీవలనావల నేచేటిల యాసల- లావు దిగుటెపో లాభము యేవగింతలకు నిరవగు నరకపు- కోవులఁబడి మునుఁగుటకంటెను ॥చ3॥ తివిరి వేంకటాధిపుదాసులకృప- లవలేశమెపో లాభము చవులని నోరికి సకలము దిని తిని భవకూపంబులఁ బడుకంటెను |
రాగము: నాట రేకు: 0032-03 సంపుటము: 1-197 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాట