బ్రహ్మ గడిగిన పాదము

బ్రహ్మ గడిగిన పాదము

॥పల్లవి॥
బ్రహ్మ గడిగిన పాదము
బ్రహ్మము దానె నీపాదము
॥చ1॥
చెలఁగి వసుధ గొలిచిన నీపాదము
బలి తల మోపిన పాదము
తలఁకక గగనము దన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము
॥చ2॥
కామినిపాపము గడిగిన పాదము
పాముతల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ పాదము
॥చ3॥
పరమయోగులకుఁ బరిపరి విధముల
పరమొసఁగెడి నీపాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన-
పరమపదము నీపాదము
రాగము: ముఖారి
రేకు: 0031-04
సంపుటము: 1-191

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి

చదవండి :  ఆటవారిఁ గూడితౌరా ఆటవారిఁగూడిఅన్నిచోట్ల బొమ్మ-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *