
ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు
॥పల్లవి॥ ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు బట్టబయలుగాఁ బరచీ నొకటి read ॥చ1॥ చెడనిమట్టిలోఁ జేసినముద్దే నడుమ ముంచుకొన్నది వొకటి తడియనినీరై తడివొడమింపుచు వడిసీని వేపుర వడితో నొకటి ॥చ2॥ పాయనితనుదీపనములుగా నటు చేయుచు మది వేఁచీ నొకటి కాయపుచుట్టరికమ్ములు చేయుచు రేయుఁబగలు విహరించీ నొకటి ॥చ3॥ యిన్నియుఁదానే యేచి కపటములు పన్నీ నిదె లోపల నొకటి వెన్నెలచూపుల వేంకటేశ నిను యెన్నికతోఁ గడు నెదిరీ నొకటి |
రాగము: ముఖారి రేకు: 0031-03 సంపుటము: 1-190 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి