
మనసున నెప్పుడు మానదిది
॥పల్లవి॥ మనసున నెప్పుడు మానదిది దిన బాధెటువలె దీఱీనో ॥చ1॥ చిత్త వికారము జీవుల పాపము తత్తరపరచక తడయ దిది కత్తులభొనీ కాయపు వయసున- నెత్తినమదమున కేదిగతో ॥చ2॥ అసలుఁగంబ మీయాశాదోషము విసిగిన నూరక విడువ దిది వసులమూఁట మోవఁగఁ బడవేయఁగ వసము గాని దెటువలెనౌనో ॥చ3॥ పాము చెలిమి రంపపుసంసారము గాములమోఁచిన గంప యిది కామించుచు వేంకటపతిఁ దలఁపక యేమరివుండిన నేమౌనో |
రాగము: లలిత రేకు: 0029-05 సంపుటము: 1-180 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత