
వెట్టిమోపువంటిమేను విడనాడి వీఁ
॥పల్లవి॥ వెట్టిమోపువంటిమేను విడనాడి వీఁ డిట్టె దాఁటిపోయె నెటువంటిజాణే ॥చ1॥ ఘెరమైనఆసల నెడికూఁకటవేరు దవ్వి – పారవేసి యిడుమలఁ బడనొల్లక యీరసపుసంసార మింగలము దగిలించి యేరు దాఁటిపోయె నెటువంటి జాణే ॥చ2॥ కన్నవారిఁ దన్నుఁ బ్రేమ నన్నవారి దిగనాడి వున్నతమైనచోట నుండఁబోయి తన్నుఁదా వేంకటపతిదాసులఁజేరి వాఁడు యెన్నఁడుఁ దిరిగిరాఁడే యెటువంటిజాణే |
రాగము: పాడి రేకు: 0028-05 సంపుటము: 1-173 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, పాడి