ఇన్ని లాగులచేతు లివియపో కడు-

ఇన్ని లాగులచేతు లివియపో కడు-

॥పల్లవి॥
ఇన్ని లాగులచేతు లివియపో కడు-
నెన్నిక కెక్కినచేతు లివియపో
॥చ1॥
గునియుచుఁ దనునెత్తుకొమ్మని తల్లిపై-
నెనయఁ జాఁచినచేతు లివియపో
కినిసి గొవర్ధనగిరి వెల్లగించిన-
యునుమువంటి చేతు లివియపో
॥చ2॥
పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన-
యిసుమంతలు చేతు లివియపో
పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో
యిసుక చల్లినచేతు లివియపో
॥చ3॥
పరమచైతన్యమై ప్రాణుల కెల్లను
యెరవులిచ్చినచేతు లివియపో
తిరువేంకటగిరి దేవుఁడై ముక్తికి-
నిరవు చూపెడుచేతు లివియపో
రాగము: ఆహిరి
రేకు: 0027-05
సంపుటము: 1-166

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి

చదవండి :  ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *