
పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి –
॥పల్లవి॥ పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి – కనుమాయలే కాక కడ నేమిగలదు open ॥చ1॥ కనుచూపు కాఁకలఁ గలయుట వెడయాస – లనుభవింపుటగాక యందేమిగలదు తనువల్లి సోఁకులఁ దగులుట మమతల – నెనయఁ గోరుటగాక యిందేమిగలదు ॥చ2॥ యెలమి నధర మాను టెరిఁగి యెంగిలి నోర నలముకొనుట గాక యందేమిగలదు పలులంపటములచేఁ బడుట దు: ఖంబులు తలఁజుట్టుటే కాక తన కేమికలదు ॥చ3॥ శ్రీ వేంకటాద్రీశుఁ జేరనిపనులెల్ల – నేపగింతలే కాక యిందేమిగలదు ఆవల సురతభోగ మనుభవింపఁబోయి రావలయుటగాక రచనేమిగలదు |
రాగము: శంకరాభరణం రేకు: 0025-02 సంపుటము: 1-150 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణం