ఉప్పవడము గాకున్న రిందరు

ఉప్పవడము గాకున్న రిందరు

॥పల్లవి॥
ఉప్పవడము గాకున్న రిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు
॥చ1॥
కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడును
వున్నతి నివి నీకుండఁగను
వెన్నెలయెండలు వెలయఁగ మేల్కొను-
టెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు
॥చ2॥
కందువ సతికనుఁగలువలు ముఖార-
విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగునీతెలివికిఁ దుద యేది
॥చ3॥
తమము రాజసము తగుసాత్వికమును-
నమరిన నీమాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపునుఁ బైకొనుటెట్లా
రాగము: ధన్నాశి
రేకు: 0024-06
సంపుటము: 1-148

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశి

చదవండి :  సహజ వైష్ణవాచార వర్తనుల-

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *