ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ –

ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ –

॥పల్లవి॥
ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ –
మాలిన్యమున నాత్మ మాసినది గాన
read
॥చ1॥
కలికాలదోషంబు కడవరానిది గాన
తలఁపుదురితముల కాధారంబు గాన
బలుపూర్వకర్మములు పట్టరానివి గాన
మలమూత్రజన్మంబు మదకరము గాన
॥చ2॥
రాఁపైనగుణవికారములు బహళము గాన
ఆఁపరానివి యింద్రియంబు లటుగాన
దాఁపరంబగుమమత దయదలంపదు గాన
కాఁపురముచే నా కప్పుకొనుఁ గాన
॥చ3॥
హృదయంబు చంచలం బిరవుగానదు గాన
చదువు బహుమార్గములఁ జాటు నటుగాన
యెదురనుండెడు వేంకట్వేరునినిజమైన-
పదముపై కోరికలు పైకొనపు గాన
రాగము: ఆహిరి
రేకు: 0024-03
సంపుటము: 1-145

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి

చదవండి :  అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *