
ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక-
॥పల్లవి॥ ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక- మాటమాత్రమున నటమటమైన సుఖము read ॥చ1॥ కొనసాగుదురితములె కూడైన సుఖము తనువిచారములలో దాకొన్న సుఖము పనిలేనియాసలకుఁ బట్టయిన సుఖము వెనుకముందరఁ జూడ వెరగైన సుఖము ॥చ2॥ నిందలకులోనైన నీరసపు సుఖము బొందికిని లంచంబుపుణికేటి సుఖము కిందుపడి పరులముంగిలి గాచుసుఖము పందివలె తనుఁదానె బ్రదికేటి సుఖము ॥చ3॥ ధృతిమాలి యిందరికి దీనుఁగడు సుఖము మతిమాలి భంగములు మఱపించు సుఖము పతివేంకటేశుకృప పడసినది సుఖము యితరంబులన్నియును నీపాటి సుఖము |
రాగము: కాంబోది రేకు: 0022-05 సంపుటము: 1-135 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కాంబోది