
పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడై
॥పల్లవి॥ పరగు బహుసజ్జన్మపరిపక్వ హృదయుఁడై మరికదా వేదాంతమార్గంబు గనుట ॥చ1॥ కలుషహరమగువివేకమ్ము గలిగినయట్టి- ఫలముగాదా కృపాపారీణుఁడౌట తలపోసి సకలభూతదయా విశేషంబు కలిగికాది గుణవికారంబు గనుట ॥చ2॥ యెదిరిఁ దనవలెనె తా నెఱఁగనేర్చినఫలము అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట పదిలమగు నాశానుభవము పాపినయట్టి- తుదగదా తాను సంతోషంబు గనుట ॥చ3॥ రతిపరాజ్ముఖమహరాజ్యమబ్బినఫలము – మతిగదా తాను కర్మత్యాగియౌట తతితోడ ఫలపరిత్యాగి చిత్తవ్యాపి- ధృతిగదా వేంకటాధిపు దాసుఁడౌట |
రాగము: నారణి రేకు: 0022-01 సంపుటము: 1-131 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నారణి