
బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగె
॥పల్లవి॥ బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తముగలిగె దయమాలి తిరుగ నాత్మజుఁ డొకఁడు గలిగె link ॥చ1॥ కనుచూపువలన నుడుగనికోరికలు గలిగె తనుకాంక్షవలనఁ బరితాపంబు గలిగె అనుభవనవలన మోహంధకారము గలిగె తనివి దీమివలన తలపోఁత గలిగె ॥చ2॥ అడియాసవలన పాయనిచలంబునుఁ గలిగె కడుమమతవలన చీఁకటి దవ్వఁగలిగె కడలేని తమకమునఁ గాఁతాళమునుఁ గలిగె నడుమ నంతటికి మాననిప్రేమ గలిగె ॥చ3॥ తరితీపు వలన చిత్తభ్రాంతి తగఁ గలిగె విరహంబువలన పురవేదనలుఁ గలిగె తిరువేంకటాచలాధిపుని కరుణామృతము పరిపూర్ణమైన యాపద నీఁదఁ గలిగె |
రాగము: శ్రీరాగం రేకు: 0021-05 సంపుటము: 1-129 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం