
తానే తెలియవలె తలఁచి దేహి తన్ను
॥పల్లవి॥ తానే తెలియవలె తలఁచి దేహి తన్ను మానుపువారలు మరి వేరీ ॥చ1॥ కడలేని భవసాగరము చొచ్చినతన్ను వెడలించువారలు వేరీ కడుబందములచేతఁ గట్టుపడినతన్ను విడిపించువారలు వేరీ ॥చ2॥ కాఁగినినుము వంటికర్మపు తలమోపు – వేఁగు దించేటివారు వేరీ మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ వీఁగఁ దోలేటివారలు వేరీ ॥చ3॥ తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని వెరపు చెప్పెడువారు వేరీ పరివోని దురితకూపములఁ బడకుమని వెరపు చెప్పెడివారు వేరీ |
రాగము: గుండక్రియ రేకు: 0021-04 సంపుటము: 1-128 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియ