
ఏమో తెలిసెఁగాని యీజీవుఁడు
॥పల్లవి॥ ఏమో తెలిసెఁగాని యీజీవుఁడు నేమంపు నెరవిద్య నేరఁడాయ ॥చ1॥ కపటాలె నేరిచెఁగానీ జీవుఁడు యెపుడైనా నిజసుఖ మెఱఁగఁడాయ కవురులే చవిగొనెఁగానీ జీవుఁడు అపరిమితామృత మానఁడాయ ॥చ2॥ కడలనే తిరిగీఁగానీ జీవుఁడు నడుము మొదలుఁ జూచి నడవఁడాయ కడుపుకూటికే పోయీఁగానీ జీవుఁడు చెడని జీతముపొంతఁ జేరఁడాయ ॥చ3॥ కనియుఁ గానకపోయఁగానీ జీవుఁడు దినము వేంకటపతిఁ దెలియఁడాయ కనుమాయలనె చొక్కెఁగానీ జీవుఁడు తనియ నిట్టే మంచిదరిఁ జేరఁడాయ |
రాగము: భూపాళం రేకు: 0020-05 సంపుటము: 1-123 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భూపాళం