నాపాలి ఘన నిధామవు నీవే నన్ను

నాపాలి ఘన నిధామవు నీవే నన్ను

॥పల్లవి॥
నాపాలి ఘన నిధామవు నీవే నన్ను
నీ పాల నిడుకొంటి నీవే నీవే
॥చ1॥
ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁ
దొలగని నిజబంధుఁడవు నీవే
పలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే
॥చ2॥
పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకు
నదనఁ దోడగుదేహమవు నీవే
మదమువాపెడి నామతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే
॥చ3॥
యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ
పంకజభవాదిదేవపతివి నీవే
అంకలి వాపఁగ సంతకు నీవే తిరు-
వేంకటేశ్వరుఁడవు నీవే నీవే
రాగము: గుజ్జరి
రేకు: 0018-02
సంపుటము: 1-108

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుజ్జరి

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుచేయి - అన్నమయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *