
ఏఁటికి దలఁకెద రిందరును
॥పల్లవి॥ ఏఁటికి దలఁకెద రిందరును గాఁటపు సిరులివి కానరో ప్రజలు ॥చ1॥ ఎండలఁ బొరలక యేచిన చలిలో నుండక చరిలోనుడుకక అండనున్న హరి నాత్మఁదలఁచిన పండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు ॥చ2॥ అడవుల నలియక ఆకునలముఁదిని కడుపులు గాలఁగఁ గరఁగక బడి బడి లక్ష్మిపతికి దాసులై పొడవగు పదవులఁ బొందరో ప్రజలు ॥చ3॥ పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ దిక్కులనంతటఁ దిరుగక గక్కన తిరువేంకటగిరిపతిఁ గని వొక్క మనసుతో నుండరొ ప్రజలు |
రాగము: ఆహిరి రేకు: 0017-01 సంపుటము: 1-101 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి