ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-
॥పల్లవి॥ ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా- కందువ శ్రీహరికరుణేకాక go ॥చ1॥ ఏఁటిజన్మమో యెఱఁగము పర- మేఁటిదో నే మెఱఁగము గాఁటపుకమలజుఁ గాఁచినయీ నాఁటకుఁడే మానమ్మినవిభుఁడు ॥చ2॥ యెవ్వారు వేల్పులో యెఱఁగము సుర లెవ్వరో నే మెఱఁగము రవ్వగు శ్రీసతిరమణుఁడు మా- కవ్వనజోదరుఁ డంతరియామి ॥చ3॥ యింకానేఁటిదో యెఱఁగము యీ – యంకెలబాముల నలయము జంకెల దనుజులఁ జదిపినతిరు- వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు |
రాగము: ముఖారి రేకు: 0014-01 సంపుటము: 1-83 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి