ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది

 

॥పల్లవి॥
ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది
॥చ1॥
ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిది
యీ పాదమే కదా యీగగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది
॥చ2॥
యీ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
యీ పాదమే కదా యీబ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది
॥చ3॥
యీ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీవేంకటాద్రిపై నిరవైనది
రాగము: శ్రీరాగం
రేకు: 0010-06
సంపుటము: 1-66

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం

చదవండి :  కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: