పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-

॥పల్లవి॥
పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-
బట్టపు బలువుఁడ బాలుఁడా
lisinopril and driving
lisinopriland.net
lisinopril and driving
॥చ1॥
ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్ను
సరుస నుతింప జఠరమున
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన-
పరమమూర్తివా బాలుఁడా
॥చ2॥
తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమున
వెల్లిగ లోలో వెఱవఁగను
కల్లనిదురతోఁ గనుమూసుక రే-
పల్లెలోఁ బెరిగిన బాలుఁడా
॥చ3॥
యేదెసఁ జూచిన నిందరి భయముల-
సేదలు దేఱఁగఁ జెలగుచును
వేదపల్లవపు వేంకటగిరిపై
పాదము మోపిన బాలుఁడా
రాగము: భైరవి-రచ్చెతాళం
రేకు: 0009-04
సంపుటము: 1-58

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భైరవి-రచ్చెతాళం

చదవండి :  నగుఁబాట్లఁ బడేనాజిహ్వ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *