వందే వాసుదేవం
॥పల్లవి॥ వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం ॥చ1॥ ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకితల సచ్చారు దేహం మందారమాలికా మకుటసంశోభితం కందర్పజనక మరవిందనాభం ॥చ2॥ ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలం ఖగరాజవాహనం కమలనయనం నిగమాదిసేవితం నిజరూపశేష ప- న్నగరాజ శాయినం ఘన నివాసం ॥చ3॥ కరిపురనాధ సంరక్షణే తత్పరం కరిరాజ వరదసంగత కరాబ్జం సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరువేంకటాచలా దేవం భజే |
రాగము: శ్రీరాగం రేకు: 0008-05 సంపుటము: 1-53 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం