ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు

॥పల్లవి॥
ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు
బూడిదిలో హోమమై పోయఁ గాలము
॥చ1॥
ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి నని
కదిసిన యాసచేఁ గడవలేక
యెదురుచూచి చూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయఁ గాలము
॥చ2॥
ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని
వింతవింత వగలచే వేఁగివేఁగి
చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని-
పొంతనున్న వెన్నయై పోయఁ గాలము
॥చ3॥
యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని
యెక్కడికైనా నూర కేఁగియేఁగి
గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక
పుక్కిటి పురాణమయి పోయఁ గాలము
రాగము: బౌళి
రేకు: 0007-04
సంపుటము: 1-48

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి

చదవండి :  నేరుపరి వైతేను - అన్నమయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *