మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును

 

॥పల్లవి॥
మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ
॥చ1॥
ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు
॥చ2॥
హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా-
కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు
॥చ3॥
పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు
రాగము: లలిత
రేకు: 0007-02
సంపుటము: 1-46

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత

చదవండి :  మాడుపూరు చెన్నకేశవ స్వామిపై అన్నమయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *