కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి-
॥పల్లవి॥ కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి- నిలయుని శ్రీనిధియైనవాని ॥చ1॥ ఆదిదేవుని నభవుని సామ- వేదనాదవినోదుని నెర- వాది జితప్రియ నిర్మలతత్త్వ- వాదులజీవనమైనవాని ॥చ2॥ దేవదేవుఁడైన దివ్యుని సర్వ- భావాతీతస్వభావుని శ్రీవేంకటగిరి దేవుఁడైన పర- దేవుని భూదేవ తత్పరుని |
రాగము: సామంతం రేకు: 0006-07 సంపుటము: 1-44 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం